SRD: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం రాష్ట్ర ఏర్పాటులో సబ్బండ వర్గాలకు ఒక్కతాటి మీదకు తీసుకొచ్చి ప్రజల్లో స్ఫూర్తిని నింపిందని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.