ADB: విశ్వకర్మల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహించిన శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఈరోజు ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో విశ్వకర్మలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.