ADB: ఈ నెల 14వ తేదీన మారేగాం నుంచి గాదిగూడ మండల కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బుధవారం ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్ ప్రకటనలో తెలిపారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండుతో ఉదయం 9.30 గంటలకు ర్యాలీ కొనసాగనుంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ పెద్దలు, నాయకులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.