WNP: రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విశ్వనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 1,80,294 రేషన్ కార్డుల్లోని 6,09,645 మంది లబ్ధిదారులకు గాను ఇప్పటివరకు 4,23,466 మంది లబ్ధిదారులు మాత్రమే E-KYC పూర్తి చేసుకున్నారని, మిగతా 1,86,179 లబ్ధిదారులు E-KYC పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు.