NRML: కల్తీ ఆహార పదార్థాల విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్ 8 హోటల్‌ను గురువారం సీజ్ చేశారు. ఇటీవల హోటల్లో తిన్న ఓ యువతి మృతిచెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు హోటల్ సీజ్ చేసినట్లు తెలిపారు.