‘యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్-2024’ ప్రారంభ సెషన్లో హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఏరివేయడానికి గొప్ప వ్యూహంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాల కట్టడి విషయంలో ప్రధాని మోదీ ప్రభుత్వ నినాదం ‘జీరో టాలరెన్స్’ అని, ప్రస్తుతం ప్రపంచమంతా ఈ విధానాన్ని అనుసరిస్తోందని వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరాడటానికి ఓ బలమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.