AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘తెనాలిలో ఓ అమ్మాయిని చంపేశారు. శ్రీకాకుళంలో ఇద్దరు బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణానికి పాల్పడింది అధికార పార్టీ నాయకుల పిల్లలే. హిందూపురంలో అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగితే చర్యల్లేవు. పిఠాపురంలో అత్యాచారాలు జరుగుతున్నాయి’ అని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి ప్రతి చోట ఉందన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.