AP: రాష్ట్రంలో విద్యుత్ రంగం కొత్త పుంతలు తొక్కుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రూ.5,407 కోట్లతో కొత్తగా సబ్స్టేషన్లు ప్రారంభించామని తెలిపారు. త్వరలో మరికొన్ని సబ్స్టేషన్లకు కూడా శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. త్వరలోనే అమరావతిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా జరుగుతుందని హామీ ఇచ్చారు.