ATP: జిల్లాలో విద్యార్థుల అపార్ అప్డేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం విద్యార్థుల అపార్ అప్డేషన్, తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు, అన్ని మండలాల విద్యాశాఖ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.