TG: ఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు గడువు పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. మొదటి సెమిస్టర్ రెగ్యులర్ ఫీజును ఈనెల 14వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో 18వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు www.osmania.ac.inలో చూసుకోవచ్చన్నారు.