TG: రేపు సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డిని ఆశీర్వదించేలా ప్రజలంతా పూజలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు.రెసిడెన్షియల్, అమ్మ ఆదర్శ పాఠశాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు, మెస్ ఛార్జీలు పెంచిన సందర్భంగా హాస్టళ్లలోనూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు.