TG: రాష్ట్ర హైకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ తగిలింది. ఖాతాదారుల వివరాలను పిటిషనర్ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిందేనని కోర్టు ఆదేశించింది. ఫిజికల్ కాపీ ఉన్నప్పుడు.. పెన్‌డ్రైవ్‌లో వివరాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని మార్గదర్శి తరపు లాయర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఉండవల్లికి వివరాలు ఇవ్వాల్సిందేనని తెలిపింది. అనంతరం పిటిషన్ విచారణను వాయిదా వేసింది.