AP: లేడీ అఘోరి ఎర్రటి దుస్తులు ధరించి శ్రీకాళహస్తి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ఈ క్రమంలో సాంప్రదాయ దుస్తులతో ఎవరు వచ్చినా స్వామివారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో బాపిరెడ్డి అన్నారు. అంతకుముందు నగ్నంగా వచ్చిన లేడీ అఘోరిని ఆలయ అధికారులు అడ్డుకున్నారు. తనను అడ్డుకున్నారనే కోపంతో ఆ అఘోరి ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. దీంతో లేడీ అఘోరికి వీడియో కాల్ చేసిన విశాఖ నాగక్షేత్రం పీఠాధిపతి యోగి ప్రభాకర్ దుస్తులు ధరించాలని కోరారు.