రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుద్ధం ఆపేందుకు పశ్చిమ దేశాలు ప్రత్యక్ష చర్చలు జరపాలని రష్యా వెల్లడిస్తోంది. మరో వైపు రష్యాపై పోరుకు మరింత మద్దతు ఇవ్వాలని మిత్రదేశాలపై ఉక్రెయిన్ ఒత్తిడి చేస్తోంది. తాజాగా హంగేరీలో జరిగిన సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా డిమాండ్లకు తలొగ్గితే.. ఐరోపాకు ఆత్మహత్యా సదృశమేనని తెలిపారు.