AP: పల్నాడు జిల్లాలోని పలు ఐసీఐసీఐ బ్యాంకుల్లో నగదు గోల్ మాల్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నరేష్ గతంలో చిలకలూరి పేట, నరసరావుపేట, విజయవాడ బ్రాంచుల్లో మేనేజర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో ఖాతాదారులు డిపాజిట్ చేసిన డబ్బును మళ్లించారు. విషయం బయట పడటంతో నరేష్ పరారయ్యాడు. సీఐడీ పోలీసులు అతన్ని నిన్న అరెస్ట్ చేశారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.