ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ మళ్లీ కెప్టెన్ అవతారమెత్తాడు. ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ వివాదంలో కెప్టెన్సీ నిషేధం ఎత్తివేయడంతో బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ ఫ్రాంఛైజీ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించింది. 2011లోనూ ఆ జట్టుకు వార్నర్ కెప్టెన్‌గా చేశాడు. కాగా బాల్ టాంపరింగ్ వివాదంలో అతడు కెప్టెన్సీ చేయకుండా క్రికెట్ ఆస్ట్రేలియా ఆరేళ్లు నిషేధం విధించింది.