VSP: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలో జరిగే 10 లక్షల పోస్ట్ కార్డుల ఉద్యమానికి ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. గురువారం విశాఖలోని పౌర గ్రంథాలయంలో వివిధ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో పోస్ట్ కార్డుల ఉద్యమానికి సంబంధించి చర్చించారు.