ALR: ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం 2.0 ఉచిత గ్యాస్ పొందడానికి, వచ్చే ఏడాది మార్చి 31లోగా లబ్దిదారులు ఈకెవైసి చేసుకోవాలని జేసీ అభిషేక్ గురువారం తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు సరఫారా చేస్తారన్నారు. ముందుగా నగదు చెల్లించి గ్యాన్ సిలెండర్ విడిపించుకోవాలని, సిలెండర్ తీసుకున్న 48గంటల్లో లబ్దిదారుల ఖాతాలో నగదు జమ చేస్తామన్నారు.