TG: త్వరలో ఆటమ్బాంబ్ పేలబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వర్ధన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. తప్పు చేసిన వారికి లక్ష్మీబాంబ్ కాదు.. ఆటమ్ బాంబ్ పేలబోతోందని అన్నారు. జనం సొమ్మును అక్రమమార్గంలో విదేశాలకు పంపారని, ఎంత పెద్దవాళ్లకైనా చట్టం చుట్టం కాదన్నారు. రూ.55 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయో తేలుస్తామన్నారు. తప్పు చేయనివాళ్లు ఉలిక్కిపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.