AP: మాజీ సీఎం జగన్కు మంత్రి అనగాని సత్యప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. జగన్ పాలనలో ప్రతి 8 గంటలకు ఒక అత్యాచారం జరిగిందని ఆరోపించారు. ప్రతి గంటకు ఇద్దరు మహిళలపై లైంగిక దాడులు జరిగాయని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై నేరాలు 25 శాతం తగ్గాయని పేర్కొన్నారు. శాంతిభద్రతల గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.