ఆస్ట్రేలియాతో ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా ? లేదా ? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకుంటే మరో ఓపెనర్ జైస్వాల్‌తో రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. అయితే వీరిద్దరి ఫామ్ టీమిండియా మేనేజ్మెంట్కు ఆందోళన కలిగిస్తోంది.