KDP: జమ్మలమడుగులో గురువారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి జమ్మలమడుగు సీహెచ్సీ విస్తరణ కోసం పట్టణంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఇందులో భాగంగా పాత ఎక్సయిజ్ ఎక్సైజ్ కార్యాలయ స్థలాన్ని, ఫైర్ ఆఫీస్ ప్రాంగణంలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించారు.