AP: మాజీ సీఎం జగన్పై హోంమంత్రి అనిత తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు. గత ఐదేళ్లలో ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదని.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఆయన మాట్లాడుతున్నారని తెలిపారు. జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని.. ఆయనకు మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం జగన్కు ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ ప్రశ్నించారు.