TG: మూసీ ప్రక్షాళన చేయాల్సిందేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కానీ ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇళ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ చేస్తామంటే ఒప్పుకోమని స్పష్టం చేశారు. రిటైనింగ్ వాల్ కట్టాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నిద్ర చేస్తామని తెలిపారు. ఒకరోజు అక్కడే తిని అక్కడే పడుకుంటానన్నారు. కులగణనకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయాలన్నారు.