కోనసీమ: రాజోలు మండల విద్యాశాఖ కార్యాలయంలో గురువారం మండల విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి నల్లి మనోహరం మాట్లాడుతూ.. మండలంలోని ప్రైవేట్ పాఠశాలలన్నీ ప్రభుత్వ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని అన్నారు. నిబంధనలను పాటించకపోతే తక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.