AP: పంచాయతీల బలోపేతానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. 12,900 పంచాయతీల్లో నిధులను గత ప్రభుత్వం వాడేసుకుందని ఆరోపించారు. ఇతర అవసరాలకు రూ.8,629 కోట్లు మళ్లించేశారని అన్నారు. ఈ అంశాలను సీఎం, ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్తాన్నారు. మరో నెలలో రూ.750 కోట్లు పంచాయతీల ఖాతాలకే రాబోతున్నాయని పేర్కొన్నారు. ప్రధాని కూడా గ్రామీణాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.