TG: గత పదేళ్లు రాష్ట్రంలో దోపిడి జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అరెస్టులతో మాజీ మంత్రి KTR ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికార మదంతో ఉన్నారని విమర్శించారు. మనిషిని, మనిషిగా గుర్తించలేదన్నారు. గత పదేళ్లలో BRS నేతలకు పేదవాళ్లు ఒక్కసారి కూడా గుర్తురాలేదని మండిపడ్డారు. మాజీ మంత్రి మోకాళ్ల యాత్ర చేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.