CTR: దీపం-2 పథకం కింద ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని జేసీ విద్యాధరి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ పథకం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967 కేటాయించడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా ఏదైనా సమస్యలు ఉంటే సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయవచ్చున్నారు. మార్చి 31 2025 లోపు తొలి ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని అన్నారు.