TG: బీఆర్ఎస్ సర్పంచ్లు ధర్నా చేయడంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. 60 మంది సర్పంచ్ల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ కారణం కాదా? అని ప్రశ్నించారు. సర్పంచ్లను రోడ్లపైకి తెచ్చింది, సర్పంచ్లకు ఇవ్వాల్సిన నిధులను మళ్లించింది బీఆర్ఎస్ కాదా? అని అడిగారు. దశలవారీగా సర్పంచ్లకు బకాయిలు విడుదల చేస్తామని తెలిపారు. రెచ్చగొట్టే నేతల మాటలు నమ్మి ఎవరూ ఆందోళన చేయవద్దని సూచించారు.