VZM: ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన ఎంపీడీఓ పై అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. బోగాపురం మండల పరిషత్ అభివృద్ది అధికారి కిషోర్ కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ గురువారం షో కాజ్ నోటీసు జారీ చేశారని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస మూర్తి తెలిపారు. కోడ్ ను అధికారులు, సిబ్బంది పాటించాలని సూచించారు.