ATP: ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో జరగనున్న శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఉత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆర్డీవో కేశవ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆలయంలో అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు, తహసీల్దార్ లక్ష్మీ పాల్గొన్నారు.