TPT: తిరుమలలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును గురువారం ఉదయం టీటీడీ ఛైర్మన్ BRనాయుడు పరిశీలించారు. తిరుమలలో చెత్త సేకరణ, తడి చెత్త, పొడి చెత్త విభజన, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు.