ఆర్థికంగా దివాలా తీసిన ప్రముఖ విమానయాన సంస్ఖ జెట్ ఎయిర్వేస్కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంస్థ ఆస్తుల విక్రయానికి కోర్టు ఆదేశించింది. సంస్థ ఉద్యోగులు, రుణ దాతల ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఆస్తుల విక్రయానికి లిక్విడేటర్‌ను నియమించాలని ఎన్సీఎల్టీ ముంబయి బెంచ్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.