కోనసీమ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరి ఉన్న కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ సిబ్బంది సంప్రదాయ స్వాగతం పలికారు. వేద పండితులు మంత్రికి ఆశీర్వాదం అందజేసి అమ్మవారి చిత్రపటం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుర్గమ్మ దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.