AP: గతంలో విద్యుత్ సంస్కరణలు తీసుకువస్తే చాలామంది తనని వ్యతిరేకించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘విద్యుత్ సంస్కరణల వల్ల ఆ శాఖ మెరుగుపడింది. విద్యుత్ ఉత్పత్తిని పెంచాం. మిగులు విద్యుత్ సాధించాం. కరెంట్ కోతలు లేకుండా చేయగలిగాం. నాణ్యమైన కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. సోలార్ పవర్‌ను ప్రోత్సహించాం. ప్రస్తుతం అమరావతిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం’ అని అన్నారు.