CTR: కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద సొంతింటి నిర్మాణాన్ని నారా బ్రాహ్మణి పరిశీలించారు. సుమారు రెండు ఎకరాల స్థలంలో సీఎం చంద్రబాబు సొంతింటి నిర్మాణాన్ని చేపట్టగా మొదటిసారి బ్రాహ్మణి ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. బ్రాహ్మణికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.