AP: త్వరలో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి ఎన్నిక జరగనుంది. దీంతో ఈ పదవిని దక్కించుకునేందుకు ఇటు టీడీపీ, అటు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యను వైసీపీ టార్గెట్ చేసింది. ఛైర్మన్ పదవి టీడీపీ వర్గానికి వచ్చేలా వైసీపీకి చెందిన కౌన్సిలర్లను బాలయ్య కొనుగోలు చేస్తున్నారని విమర్శలు చేసింది. కాగా ఈ విమర్శలను టీడీపీ నేతలు ఖండించారు.