TG: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కులగణనపై ఎంపీ డీకే అరుణ ప్రశ్నలు సంధించారు. కులగణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉందని అన్నారు. బీసీలను మోసం చేసేందుకే ప్రభుత్వం సర్వే చేపట్టిందని ఫైర్ అయ్యారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అని అడుగుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. కులగణన సర్వే ఎందుకో ప్రభుత్వం స్పషం చేయాలని డిమాండ్ చేశారు.