TG: మల్లారెడ్డి వైద్య కళాశాల పీజీ మెడికల్ సీట్ల అక్రమాల కేసులో ఈడీ విచారణ చేపట్టింది. ఈడీ విచారణకు మల్లారెడ్డి వైద్య కళాశాల అధికారి సురేందర్ రెడ్డి హాజరయ్యారు. గతంలో మెడికల్ సీట్ల బ్లాకింగ్ వ్యవహారంపై మట్టెవాడ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వ్యక్తులు, ఏజెన్సీలు, విద్యార్థులతో మెడికల్ కళాశాలలోని సీట్లను బ్లాక్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మట్టెవాడ పీఎస్ లో మరో కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తుంది.