KDP: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు షెడ్యూల్ని మరో రెండు నెలల పాటు వాయిదా వేసి ఎలాంటి వివాదాలు లేకుండా ఫిబ్రవరిలో నిర్వహించేలా చూడాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డివైఎఫ్ఎ) జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ తెలిపారు. గురువారం ప్రొద్దుటూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు డేవిడ్ రాజ్, వెంకటేష్ పాల్గొన్నారు.