అన్నమయ్య: జిల్లా కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ.. ప్రతిపక్షం ప్రశ్నించకూడదనే ధోరణి అవలంభించడం మంచి పద్ధతి కాదన్నారు. సామాజిక మాధ్యమాలలో పోస్ట్ పెట్టిన వారిని పోలీసులు సివిల్ డ్రెస్సులలో వెళ్లి అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు.