AP: తాను బాంబులకు భయపడలేదు.. కానీ వైసీపీ నేతల వ్యాఖ్యలకు బాధపడ్డానని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో మదమెక్కి ఆంబోతుల మాదిరిగా కామెంట్లు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్‌తో పాటు ఆయన పిల్లలపై కూడా నీచమైన వ్యాఖ్యలు చేశారన్నారు. వాళ్లు 11 కాదు.. ఒక్క సీటు గెలవడానికి కూడా అర్హత లేదన్నారు.