AP: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను నాశనం చేసిందని మండిపడ్డారు. పేదలపై విద్యుత్ భారానికి కారణం YCP ప్రభుత్వమేనని అన్నారు. 9సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి రూ.36వేల కోట్ల భారం వేసిందని చెప్పారు. అమరావతిని ఎడారిగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని కాపాడిన ఘనత ఆడబిడ్డలదే అని మహిళలను ప్రశంసించారు. అమరావతిని నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు.