ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ సమస్యను నివారించడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వాయు కాలుష్యానికి కారణమయ్యే పంట వ్యర్థాల దహనంపై ఉన్న జరిమానాను రెట్టింపు చేసింది. దీని ప్రకారం 2 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతు వ్యర్థాలను దహనం చేస్తే రూ.5వేలు, 2-5 ఎకరాల మధ్యలోని వారు రూ.10వేలు, అంతకంటే ఎక్కువ భూమి ఉన్నవారు రూ.30 వేలు జరిమానా కట్టాలి. ప్రస్తుతం ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉన్నాయి.