TG: మాజీమంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులిచ్చింది. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై గతేడాది జూన్‌లో మల్లారెడ్డికి సంబంధించిన 12 మెడికల్ కాలేజీల్లో అధికారులు సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. 10కాలేజీల్లో 45సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు.