SDPT: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై గురువారం ఆయన స్పందిస్తూ.. కోర్టు కాపీ అందిన వెంటనే చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం తరఫున న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.