BHNG: మొంథా తుఫాన్ ప్రభావంతో HYD జంట నగరాల్లో కురుస్తున్న వర్గాల కారణంగా జూలూరు- రుద్రవెల్లిలో లొలెవల్ బ్రిడ్జి వద్ద బుధవారం ఉదయం మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో అధికారులు ఇరువైపులా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోచంపల్లి- బీబీనగర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.