NZB: బోధన్ మండలం కమండలంలోని కల్దుర్కిలో బుధవారం రాత్రి దుండగులు రెచ్చిపోయారు. వ్యవసాయ క్షేత్రాల్లోని ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి, వాటిలోని కాపర్ వైరు, ఆయిల్‌ను ఎత్తుకెళ్లినట్లు రైతు రాము తెలిపారు. ఉదయం పొలానికి వెళ్లగా విషయం వెలుగుచూడటంతో ట్రాన్స్‌కో ఏఈకి ఫిర్యాదు చేశారు. సాగు నీరందే సమయంలో విద్యుత్ పరికరాల చోరీతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.