MBNR: కురుమూర్తి రాయుడుని స్పీకర్ గడ్డం ప్రసాద్ దర్శించుకున్నారు. మంత్రి శ్రీహరి, ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జిల్లా ఫిషరీస్ ఛైర్మన్ గోనెల శ్రీనివాసులు పాల్గొన్నారు.