MBNR: సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ ఫుట్ బాల్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు పాలమూరు విశ్వవిద్యాలయ పురుషుల జట్టు ఆదివారం వెళ్లారు. క్రీడాకారులకు వీసీ ప్రొ.జీ.ఎన్.శ్రీనివాస్ క్రీడా దుస్తులు, ట్రాక్ సూట్లను పంపిణీ చేశారు. మైదానంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వర్సిటీ కీర్తిని చాటాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు పీడీ శ్రీనివాసులు కోచ్లు తదితరులు పాల్గొన్నారు